మందుగుండు సామాగ్రీని ఆన్ లైన్ లో అమ్మిన వ్యక్తి అరెస్టు
- June 06, 2017
ఆమధ్య సంక్రాంతి సీజన్ లో తెలుగు రాష్ట్రాలలో ఆన్ లైన్ లో పిడకలు ..గొబ్బిమ్మలు ఆర్డర్ పై అమ్మడం..పలువురు కొనుగోలు చేయడం చూసి ఆశ్చర్యపోయాం .ప్రమాదం లేని పేడ తాలూకా వస్తువులు ..కనుక ఆపై పండుగ సమయంలో అంతగా లభ్యత ఉండదు కాబట్టి..ఆ విన్నూత్న ఆలోచన చేసి ఆన్లైన్ లో వ్యాపారం చేసిన వ్యక్తిని అందరూ అభినందించారు. అదే రీతిలో మందుగుండు సామాగ్రిని సోషల్ మీడియా ద్వారా విక్రయించడానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముహర్రక్ గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ చేసిన ఒక ప్రకటన ప్రకారం, అనుమానిత వ్యక్తిని అరెస్టు చేశారు, పోలీసులు ఒక చిట్కాని ఉపయోగించి ఆన్ లైన్ లో 900 ప్యాకెట్ల మందుగుండు సామాగ్రీ కావాలని ఆర్డర్ ఇచ్చారు. . కింగ్ ఫాహ్డ్ కాజ్వే ద్వారా అందచేసినందుకు నిందితుడు ఏర్పాట్లు చేశాడు. అరెస్ట్ కాబడిన ఆ నిందితుడు తన ఆరోగ్య పరిస్థితిని బాగోలేనందున ఆన్లైన్ లో ఈ వ్యాపారం మొదలుపెట్టినట్లు తెలిపాడు ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించి నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. పేలుడు సామగ్రి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిపై 1976 లో 16 వ చట్టానికి సంబంధించిన 2 వ అధికరణ ప్రకారం, పేలుడు పదార్థాలను కలిగి ఉన్న వారెవరైనా రెండు నుండి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 50 నుండి 200 బహారిన్ దినార్ల మధ్య జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







