జెట్ ఎయిర్వేస్ మెంబర్స్ కోసం బోనస్ జెపి మైల్స్
- June 06, 2017
జెట్ ఎయిర్వేస్, జెట్ ప్రివిలేజ్ మెంబర్స్ కోసం సరికొత్త ఆఫర్‌ని తీసుకొచ్చింది. జూన్ 24 నుంచి బుక్ చేసుకునే టిక్కెట్లకు అత్యధికంగా మూడు రెట్ల బోనస్ జెపి మైల్స్‌ని అందించనుంది. ఒమన్ నుంచి వెళ్ళే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్ జెట్ ప్రివిలేజ్కి సంబంధించిన మెంబర్స్ అందరికీ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు జూన్ 28 నుంచి డిసెంబర్ 6 మధ్యలో ప్రయాణించాల్సి ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్జైది మాట్లాడుతూ, ఫెస్టివ్ సీజన్, అలాగే స్కూల్ హాలీడేస్ నేపథ్యంలో ప్రయాణీకులకు అద్భుతమైన ప్రయాణానుభూతితోపాటు, ఆకర్షణీయమైన ఆఫర్లను అందించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జెట్ ఎయిర్ వేస్ వెబ్సైట్ ద్వారా జెట్ ప్రివిలేజ్ ప్రోగ్రామ్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుంది. ఆ వెంటనే జెపి మైల్స్ బోనస్ పాయింట్స్‌ని పొందవచ్చు.
తాజా వార్తలు
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా







