జూన్ 9న విడుదల కానున్న 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'
- June 06, 2017
ఈ సినిమాతో నూతన తారలు శేఖర్ వర్మ, దీప్తి శెట్టి హీరోహీరోయిన్లుగా గ్రాయత్రి ప్రొడక్షన్స్ పతాకం పై కె.ఎస్.రావు నిర్మాణ సారథ్యంలో నూతన దర్శకుడు నరేశ్ పెంట తెరకెక్కించిన సినిమా 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'. మే 26న ఈ సినిమా విడుదల చేశారు. ప్రిమియర్ చూసిన ప్రతి ఒక్కరు నుండి చిత్రం చూసిన ప్రతి ఓక్కరూ మంచి చిత్రం చూశారని ప్రశంశలు కురిపించారు. చిన్న చిత్రం అని చూడకుండా మంచి చిత్రానికి పాజిటివ్ గా స్పందిచడంతో చిత్ర యూనిట్ సభ్యుల్లో నూతనోత్సాహన్ని కలిగించింది. దర్శకుడు నరేశ్ పెంట ఈ సినిమాను మనసుని హత్తుకునే రీతిన తెరకెక్కించారని, ఈ సినిమా చూసినంత సేపు పల్లెల్లో తిరిగిన అనుభవం ప్రేక్షకులకి తప్పక వస్తుంది. ఇదే విషయాన్ని ప్రేక్షకులు ఫోన్ చేసి కూడా చెప్పటం విశేషం. అలానే తెలుగు ఫ్యామిలీల్లో ఉండే ఎమోషన్స్ ని మనసుకి హత్తుకునే రీతిన ఈ సినిమా ఉందని విమర్శకులు సైతం తెలిపారు. ఈ చిత్రాన్ని జూన్ 9న బెంగళూర్ లో దాదాపు 41 దియోటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తప్పకుండా బెంగుళూర్ లోని తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి రచన-సంగీతం-దర్శకత్వం నరేశ్ పెంట. నిర్మాత : కే.యస్.రావు, సినిమాటోగ్రఫి : కూనపరెడ్డి జయకృష్ణ, నిర్మాణ నిర్వహణ : కే.ఆర్. ప్రశాంత్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







