అసత్య ఆరోపణలతోనే తెగతెంపులు
- June 06, 2017
సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ తమతో సంబంధాలు తెంచుకోవడం వెనుక అసత్యాల ప్రచారమే కీలక భూమిక పోషించిందని ఖతార్ క్యాబినెట్ తీర్మానించింది. ఖతార్‌తో పలు దేశాలు తమ బోర్డర్‌ని మూసివేయడం, అలాగే ఎయిర్ కనెక్టివిటీని రద్దు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్ని ఖతార్ క్యాబినెట్ మీక్షించింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా సైతం వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల ఖతార్ అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. క్యాబినెట్ ఎక్స్‌ట్రార్డినరీ మీటింగ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని నేతృత్వంలో ఎమిర్ దివాన్‌లో జరిగింది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ జైద్ అల్ మహమౌద్ మాట్లాడుతూ సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ జారీ చేసిన స్టేట్‌మెంట్స్‌ని క్యాబినెట్ రివ్యూ చేసిందని అన్నారు. ఖతార్ ఇప్పటికీ పొరుగుదేశాలతో కలిసి వివిధ అంశాల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉందనీ, రీజియన్ అభివృద్ధికి కట్టుబడి ఉందనీ, తీవ్రవాదంపై పోరులో రాజీపడే ప్రసక్తే లేదని ఖతార్ పేర్కొంది. ఖతార్ ప్రజలు జరుగుతున్న దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇంకో వైపున ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, కువైట్ ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సుమాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







