జపాన్‌ను అధిగమించనున్న భారత్
- June 06, 2017
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ పరంగా చూస్తే భారత్ వచ్చే ఐదేళ్లలో జపాన్‌ను అధిగమిస్తుందని బీఎంఐ రీసెర్చ్ తన నివేదికలో అంచనా వేసింది. దీనికి పెద్ద పెద్ద రెసిడెన్షియల్, నాన్–రెసిడెన్షియల్ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొంది. భారత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ప్రస్తుతం ఆసియాలోనే మూడో అతిపెద్దదని పేర్కొంది. 2023 నాటికి స్వల్ప తేడాతో జపాన్‌ను అధిగమించొచ్చని తెలిపింది. నిర్మాణ రంగంపై డీమోనిటైజేషన్ గతేడాది ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ మళ్లీ 2017లో బలమైన వృద్ధి నమోదుకానుందని వివరించింది.
భారతీయ ఇన్‌ఫ్రా రంగం అధిక వ్యయాలు, ప్రాజెక్టుల ఆలస్యం వంటి పలు సమస్యలతో సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల భారత్‌లో మౌలిక సదుపాయాల లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ఇక రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, పవర్ ట్రాన్స్‌మిషన్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్లకు డిమాండ్ పెరిగిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు సంస్కరణలు ఇన్‌ఫ్రా రంగ వృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది









