నేపాల్ ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ ఛైర్మన్ షేర్ బహదూర్ దేవ్‌బా
- June 06, 2017
నేపాల్ తదుపరి ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ ఛైర్మన్ షేర్ బహదూర్ దేవ్‌బా (72) ఎన్నికయ్యారు. ప్రచండ రాజీనామా నేపథ్యంలో పార్లమెంట్‌లో చేపట్టిన ఓటింగ్ ద్వారా దేవ్‌బాను తదుపరి ప్రధానిగా ఎన్నుకున్నారు. నేపాల్ పార్లమెంట్‌లో మొత్తం 593 మంది సభ్యులకు గాను 388 మంది ఆయనకు అనుకూలంగా.. 170 మంది వ్యతిరేకంగా ఓటువేశారు. 35 మంది గైహాజరయ్యారు. దీంతో నాలుగోసారి నేపాల్ ప్రధానిగా దేవ్‌బా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
నేపాల్ ప్రధానిగా పుష్పకమల్ దహాల్ ప్రచండ తన పదవికి గత నెల 24న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అధికార మార్పిడిపై నేపాలీ కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరిస్తూ ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. 2016 ఆగస్టులో ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు-సెంటర్) నేపాలీ కాంగ్రెస్‌తో జతకట్టి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
తాజా వార్తలు
- Mohammed bin Rashid Leadership Forum: Leaders and experts outline priorities for Dubai’s next phase of growth
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







