నిశ్చితార్ధం జరుపుకొన్న ఐటెమ్ భామ ముమైత్ ఖాన్.. త్వరలోనే పెళ్లి

- June 06, 2017 , by Maagulf
నిశ్చితార్ధం జరుపుకొన్న ఐటెమ్ భామ ముమైత్ ఖాన్.. త్వరలోనే పెళ్లి

బాలీవుడ్ నుంచి ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే అంటూ టాలీవుడ్ లో ఐటెమ్ భామ ముమైత్ ఖాన్.. ఐటెమ్ భామలను స్పెషల్ గా బాలీవుడ్ నుంచి దిగుమతి చెయ్యడం లో దిట్టైన పూరీ స్కూల్ నుంచి వచ్చిన భామ ముమైత్ ఖాన్.. మత్తెక్కించే కళ్ళతో.. కుర్రకారుకు గేలం వేసిన ఈ భామ.. ఐటెమ్ గర్ల్ గా అలరిస్తూనే.. మైసమ్మ ఐపీఎస్ సినిమాలో హీరోయిన్ గా కూడా చేసి ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకొన్న ఈ భామ కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నది.. కాగా ఇటీవల డిక్టేటర్, తిక్క సినిమాల్లో ఐటెమ్ సాంగ్ తో రీ ఎంట్రీ ఇచ్చినా అవి అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి.. పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నది.. తన ఫ్రెండ్ ముంబై లోని ప్రముఖ వ్యాపార వేత్త అభిజిత్ ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ కావాలని కోరుకొంటున్నట్లు బీ టౌన్ టాక్.. వీరిద్దరూ 5 ఏళ్లుగా మంచి ఫ్రెండ్స్ అని ముమైత్ తన ప్రేమ విషయం అభిజిత్ కు చెప్పగానే అంగీకరించి ఇటీవల తమ కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్ధం చేసుకొన్నారు.. అని సమాచారం.. త్వరలో పెళ్లి చేసుకోవడాని ఈ జంట రెడీ అవుతుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com