టర్కీ పేలుళ్ళను ఖండించిన ఖతార్
- October 11, 2015
టర్కీ రాజధాని అంకారాలో తీవ్రవాదులు బాంబు పేలుళ్ళకు పాల్పడటాన్ని ఖతార్ ఖండించింది. సామాన్యుల్ని చంపడం దుర్మార్గమని ఖతర్ ఓ ప్రకటనలో తెలిపింది. టర్కీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఖతార్ ఎప్పుడూ ముందుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఖతార్ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. అంకారాలో జరిగిన పేలుళ్ళలో 95 మందికి పైగా సామాన్యులు మృత్యువాత పడ్డారు. టర్కీ పేలుళ్ళను ఎమిర్ షేక్ తమిమ్ అబ్దుల్లా హమాద్ అల్ థనీ ఖండించారు. టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో ఎమిర్ షేక్ ఫోన్‌లో మాట్లాడారు. జరిగిన ఘటన దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు ఎమిర్ షేక్.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్‌లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!







