మిడిల్‌ ఫింగర్‌ చూపినందుకు మహిళకు జైలు

- June 07, 2017 , by Maagulf
మిడిల్‌ ఫింగర్‌ చూపినందుకు మహిళకు జైలు

రహదారిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడమే కాకుండా మిడిల్‌ ఫింగర్‌ చూపించి అసభ్యకరంగా వ్యవహరించిన కేసులో రష్యాకి చెందిన మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ రికార్డుల ప్రకారం 2016 మే 24న పామ్‌ జుమైరాలో, నిందితురాలు నిర్లక్ష్యంగా వాహనం నడిపి, రోడ్డుని బ్లాక్‌ చేసి, మరో వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులపై దూషణకు దిగింది. 41 ఏళ్ళ అమెరికన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తగిన లైసెన్స్‌ లేకుండా వాహనాన్ని నడపడం, ఇతరుల లైసెన్స్‌ చూపించి పోలీసులను మోసగించే ప్రయత్నం చేయడం, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వంటి కేసుల్లో రష్యన్‌ మహిళను దోషిగా న్యాయస్థానం నిర్ధారించింది. కోర్టు తీర్పుని అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com