హీరో నితిన్ తో మరోసారి రొమాన్స్ కు రెడీ అంటోన్న మేఘా ఆకాశ్

- June 07, 2017 , by Maagulf
హీరో నితిన్ తో మరోసారి రొమాన్స్ కు రెడీ అంటోన్న మేఘా ఆకాశ్

మోడలింగ్ నుంచి హీరోయిన్ గా అడుగు పెట్టిన మేఘా ఆకాష్ కు టాలీవుడ్ లో వరస ఆఫర్స్ అందుతున్నాయి. ఇప్పటి వరకు మేఘా ఆకాష్ నటించిన ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే వరస ఆఫర్స్ ను అందుకొంటున్నది.. కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తూనే.. నితిన్ , హను రాఘవ పూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లై సినిమాలో కూడా నటిసున్నది.. తాజాగా మరో సినిమా ఛాన్స్ అందుకొన్నట్లు తెలుస్తోంది...
నితిన్ హీరోగా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో మేఘా ఆకాశ్ ఛాన్స్ దక్కించుకొన్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే పూజా కార్యక్రమంగా జరుపుకొన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నెక్స్ట్ వీక్ నుంచి జరుపుకొనున్నది.. ఈ సినిమాతో చైతన్య కృష్ణ దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com