ఆగష్టులో జరిగిన సిరియా లో నరమేధానికి ప్రత్యక్ష సాక్షి.. నాటి బాలుడు.. నేడు ఇలా
- June 07, 2017
సిరియా నర మేధానికి ప్రత్యక్ష సాక్షి ఈ అమాయక బాలుడు అంటూ.. గత ఆగష్టులో జరిగిన బాంబు దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఓ 5 ఏళ్ల చిన్నారి బాలుడిని ప్రపంచానికి మీడియా.. సోషల్ మీడియా పరిచయం చేసింది.. అప్పటి ఫోటోలో బాలుడు ని చూసిన ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవ్వడమే కాదు.. ఆ ఫోటోలో ఈ బాలుడు రక్తమోడుతున్న ముఖంతో... కన్నీరు .. భయం.. కలిసిన ఓ కుర్చీలో కూర్చున్న బాలుడు ఇప్పటికీ అందరి మదిలోనూ చెరగని జ్ఞాపకంగా ఉండే ఉండిఉంటాడు.. ఆ బాలుడు ఇప్పుడు చలాకీ కుర్రాడుగా మారాడు.. వివరాల్లోకి వెళ్తే...
సిరియాలో అలెప్పో లో జరిగిన దాడుల్లో డక్నీష్ అన్న 10 ఏళ్ళ అలీ మరణించగా,, 5 ఏళ్ల ఒమ్రాన్ డక్నీష్ గాయపడ్డాడు.. ఈ చిన్నారిని ఒకరు రక్షించి అంబులెన్స్ లో చేర్చగా... ఆస్పత్రిలో చాలా కాలం పాటు చికిత్స ను పొందాడు.. ఇటీవల డిశ్చార్జ్ అయిన ఈ చిన్నారి.. తన తల్లిదండ్రుల వద్దకు చేరాడు.. ఇతని ఫ్యామిలీని లేబసీస్ టీవీ యాంకర్ ఇంటర్వ్యూ చేసింది.. ఈ ఇంటర్వ్యూలో భయం ఛాయలు పోనీ ఈ బాలుడు మాట్లాడలేక పోయాడు.. భయం భయంగా తండ్రి ఒడిలో నే కూర్చున్నాడు.. దీంతో ఆ యాంకర్ ఆనాటి భయంకరమైన దృశ్యాలు.. జ్ఞాపకాలు డిక్నీష్ ను వెంటాడుతున్నట్లు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







