దుబాయిలో యాంకర్ ని తిట్టి కొట్టడానికి ప్రయత్నించిన షారూఖ్ ఖాన్
- June 07, 2017
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కి కోపం వచ్చింది.. దీంతో షో కి హోస్ట్ చేస్తున్న యాంకర్ పై విరుచుకొని పడ్డాడు.. వెనకముందు ఆలోచించకుండా.. చెడామడా తిట్టేశాడు.. మరి షారూఖ్ కి ఇంత కోపం తెప్పించిన కారణం ఏమిటి.. ఎక్కడ జరిగింది అంటే.. దుబాయ్ లోని ఓ షో లో జరిగింది... ప్రస్తుతం ఈ వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
ఎడారిలో ఓ అమ్మాయి తో పాటు ఊబి లాంటి బురదలో షారూఖ్ కనిస్తున్నాడు.. కాగా వీరిద్దరూ ఊబిలో ఉన్న సమయంలో వారి వైపు.. ఓ కొమొడో డ్రాగన్ (భారీ ఉడుము) వారి వైపు వస్తుంది.... అలా కొమొడో తమ వైపు వస్తుంటే.. షారూఖ్ పక్కన ఉన్న అమ్మాయి భయంతో అరవడం మొదలు పెట్టింది.. షారూఖ్ కూడా ఏమి చెయ్యాలో తెలియక అటు ఇటు చూస్తున్నట్లు ఆ వీడియో లో ఉన్నది.. కాగా తమ వైపు వచ్చింది.. నిజమైన కొమొడో కాదని.. తమని భయపెట్టడానికి ఓ వ్యక్తి సరదాగా కొమొడో వేషం వేసుకొని వచ్చాడని తెలుసుకొన్న షారూఖ్ సదరు వ్యక్తి పై సీరియస్ అయ్యాడని... ఆ ఊబి నుంచి బయటకు వచ్చిన అనంతరం షారూఖ్ ఆ వ్యక్తిని కొట్టడానికి కూడా ప్రయత్నించినట్లు ఆ వీడియో కనిపిస్తున్నది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







