ఖతార్‌పై సింపతీ చూపితే కఠిన చర్యలు

- June 07, 2017 , by Maagulf
ఖతార్‌పై సింపతీ చూపితే కఠిన చర్యలు

యూఏఈ: సోషల్‌ మీడియా లేదా ఇతర మార్గాల్లో ఖతార్‌పై సింపతీ చూపినట్లయితే కఠిన చర్యలకు గురవుతారని యూఏఈ అటార్నీ జనరల్‌ హెచ్చరించారు. డాక్టర్‌ హమాద్‌ సైఫ్‌ అల్‌ షమ్షి మాట్లాడుతూ, ఖతార్‌ విషయంలో యూఏఈ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుందనీ, యూఏఈ ఇతర జిసిసి అలాగే అరబ్‌ నేషన్స్‌ పట్ల ఖతార్‌ అనుసరిస్తున్న వైఖరి అభ్యంతరకరంగా ఉండటం వల్లే కఠిన నిర్ణయాలు తప్పలేదని చెప్పారు. యూఏఈ నేషనల్‌ సెక్యూరిటీని కాపాడేందుకోసం తీసుకున్న కఠిన చర్యల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన సూచించారు. ఖతార్‌పై ఏ రూపంలో సానుభూతి తెలిపినా చట్టపరమైన చర్యలను కొనితెచ్చుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికల్ని బేఖాతరు చేసేవారికి 3 నుంచి 15 ఏళ్ళ జైలు శిక్ష, 500,000 తక్కువ కాకుండా జరీమానా తప్పదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com