ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవోగా సాంబశివరావు నియమితులయ్యారు
- June 08, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు కార్పొరేషన్.. ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవోగా కె.సాంబశివరావు నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా డి.మార్కండేయులు బాధ్యతలు చేపట్టనున్నారు. అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఈవోగా ఉన్న కె.నాగేశ్వరరావును విజయనగరం జేసీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సాల్మన్ రాజ్‌కుమార్ విజయనగరం జిల్లా డీఆర్‌వోగా బదిలీ అయ్యారు. కడప డీఆర్‌డీఏ పీడీగా ఎల్.విజయచందర్‌ను నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిఫ్యూటీ కలెక్టర్ వైవీ సత్యభాస్కర్‌ను సీసీఎల్‌ఏలో సహాయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరో డిఫ్యూటీ కలెక్టర్ గౌతమిని తిరుమల తిరుపతి దేవస్థానం ఉప జేఈవోగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న నాన్‌రాజును విపత్తుల నిర్వహణ కేంద్రం కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్)గా నియమించారు. నెల్లూరులో పనిచేస్తున్న కనక నర్సారెడ్డిని చిత్తూరు జిల్లా షెడ్యూలు కులాల సేవా సహకార సంఘం ఈడీగా నియమించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







