హీరోయిన్ నటి త్రిషకు రూ.1.15 కోట్ల జరిమానా
- June 08, 2017
సినీ నటి త్రిషకు విధించిన రూ.1.15 కోట్ల జరిమానాను ట్రిబ్యునల్ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఐటీ శాఖ మద్రాసు హైకోర్టులో అప్పీలుకు వెళ్లింది. 2010-11వ సంవత్సరంలో తన ఆదాయం రూ.89 లక్షలంటూ త్రిష అడ్వాన్స్ రిటర్ను దాఖలు చేశారు. సినిమాల్లో నటించేందుకు అడ్వాన్సుగా తీసుకున్న మొత్తాలను ఇందులో కలపలేదు. దాంతో, అడ్వాన్సులు కూడా ఆదాయం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసిన ఐటీ శాఖ.. రూ.1.15 కోట్ల జరిమానా విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ త్రిష దాఖలు చేసిన కేసులో ట్రిబ్యునల్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐటీ శాఖ గురువారం మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను కోర్టు జూన్ 13వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









