కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూత
- June 09, 2017
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. 1936, నవంబర్ 20న జన్మించిన పాల్వాయి గోవర్దన్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నందంపల్లి.
1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా, 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఎంపీగా ఉన్నారు. కాగా ఆయన భౌతికకాయాన్ని కులుమనాలి నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పాల్వయి ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







