నిన్నహీరో ప్రభాస్‌.. నేడు హీరో సందీప్‌

- June 09, 2017 , by Maagulf
నిన్నహీరో ప్రభాస్‌.. నేడు హీరో సందీప్‌

 ప్రభాస్‌ ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్‌ కొత్త లుక్‌లో కన్పించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ పూర్తిగా గెడ్డం, మీసాలు తీసేసిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది.
ఇప్పుడు మరో యువ హీరో సందీప్‌ కిషన్‌ క్లీన్‌ షేవ్‌తో కొత్త లుక్‌లో కన్పిస్తున్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ‘నగరసూరన్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఇలా క్లీన్‌షేవ్‌ చేసుకోవాల్సి వచ్చిందంటూ సందీప్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com