‘ప్రేమ కావాలి’ ఆది కొత్త చిత్రం షురూ

- June 09, 2017 , by Maagulf
‘ప్రేమ కావాలి’ ఆది కొత్త చిత్రం షురూ

‘ప్రేమ కావాలి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ‘లవ్‌లీ’, ‘సుకుమారుడు’, ‘చుట్టాలబ్బాయ్‌’ తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు ఆది. ఆయన కథానాయకుడిగా త్వరలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. విశ్వనాథ్‌ అరిగెల దర్శకుడు. కన్నడనటి శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. యూఎస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి, విజయ్‌లక్ష్మి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్‌ పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆది ప్రస్తుతం హారర్‌ కామెడీ మల్టీస్టారర్‌ ‘శమంతకమణి’లో నటిస్తున్నారు. సందీప్‌ కిషన్‌, సుధీర్‌బాబు, నారా రోహిత్‌, కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com