బ్రిటన్ ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికైన తొలి సిక్కు మహిళ ప్రీత్ కౌర్
- June 09, 2017
బ్రిటన్ ఎన్నికల్లో ఓ సిక్కు మహిళ చరిత్రాత్మక విజయం సాధించి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కాగా, బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి సిక్కు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమే ప్రస్తుత సండ్వెల్లి కౌన్సిలర్ ప్రీత్ కౌర్ గ్రిల్.
ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ప్రీత్‌కౌర్ గ్రిల్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ నుంచి పోటీ చేసి 24,124 ఓట్లు సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి కరోలిన్ స్క్వైర్‌పై గ్రిల్ 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఎడ్జ్‌బాస్టన్‌కు ఎంపీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
ఎడ్జ్‌బాస్టన్ ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు. బ్రిటన్ పార్లమెంటులో తొలిసారి అడుపెడుతండటం తనకు ఆనందంగా ఉందని ప్రీత్ కౌర్ చెప్పారు.
కాగా, అదే పార్టీకి చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్మన్జీత్ సింగ్ దేశి కూడా కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిపై 16,998 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. స్లోగ్ సీటు నుంచి తన్మన్జీత్ పోటీ చేసి 34,170 ఓట్లు సాధించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిక్కులకు అవకాశం ఇచ్చినందుకు లేబర్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పార్టీ నుంచి పోటీ చేసిన మరో సిక్కు అభ్యర్థి కుల్దీప్ సహోతా ప్రత్యర్థి చేతిలో 720 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బ్రిటన్ పార్లమెంట్‌కు ఇద్దరు సిక్కు అభ్యర్థులు గెలుపొందడం ఇదే తొలిసారి. కాగా, బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో 56మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు పోటీ చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







