రంజాన్ సందర్భంగా డల్లాస్ లో రెహబార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

- June 09, 2017 , by Maagulf
రంజాన్ సందర్భంగా డల్లాస్ లో రెహబార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

రెహబార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డల్లాస్ లో రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. డల్లాస్ లోని పలు తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు.. ఈ ఇప్తార్ విందుకు హాజరయ్యారు. రెహబార్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, రసీమ్ షేక్, అజర్ పాషా ఆధ్వర్యంలో నడుస్తున్న రెహబార్ ఫౌండేషన్.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, నల్గొండ, బాపట్ల సహా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలకు కట్టు మిషన్లు, నిరుద్యోగ విద్యార్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ కేంద్రాలు నిర్వహించడంతో పాటు నిరుపేద ముస్లింలకు అహారాన్ని అందిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com