మ్యాక్స్ బాక్స్ ద్వారా ట్రాఫిక్ చలానా చెల్లింపులు
- October 11, 2015
డైరెక్టర్ ఆఫ్ స్మార్ట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్ కల్నల్ ఖలీద్ నాజర్ అలీ రజ్కి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ట్రాఫిక్ చలాన్లను మ్యాక్స్ బాక్సుల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. మ్యాక్స్ బాక్స్‌ల్లో క్రెడిట్ కార్డుల్ని స్వైప్ చేసి, ట్రాఫిక్ చలాన్ల రుసుమును చెల్లించాల్సిందిగా కోరారు. ట్రాఫిక్ చలాన్లను సమర్థవంతంగా సేకరించేందుకు మ్యాక్స్ బాక్స్‌లు ఉపయోగపడ్తాయనీ, వాహనదారులకూ ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారాయన. మ్యాక్స్ బాక్స్ జనరల్ మేనేజర్ రిచార్డ్ వైట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్యాక్స్ బాక్స్ మిడిల్ ఈస్ట్ సీఈఓ డాక్టర్ అనాస్ మాట్లాడుతూ, దుబాయ్ పోలీసులు వాహనదారుల కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడ్తున్నారనీ, దుబాయ్ ఎం-గవర్నమెంట్లో మ్యాక్స్ బాక్స్ ఓ ముందడుగు అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







