గల్ఫ్ నిబంధనలు, భద్రతపై ఖతార్‌కి యూఏఈ సూచనలు
- June 09, 2017
గల్ఫ్ రీజియన్‌లో ఉద్రిక్తతలకు కారణమయ్యే పరిస్థితులపై కఠినంగా వ్యవహరించాలని యూఏఈ, ఖతార్‌కి సూచించింది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అన్వర్ గర్గాష్ మాట్లాడుతూ ఖతార్ తన ఆలోచనల్ని మార్చుకోవాలనీ, గల్ఫ్ ఐక్యతకు, గల్ఫ్ దేశాల మధ్య సఖ్యతకు ఖతార్ కట్టుబడి ఉండాలని చెప్పారు. అల్ ఖైదా, ముస్లిం బ్రదర్‌హుడ్ అలాగే హమాస్ లీడర్స్‌కి ఆర్థికంగా అండదండలు అందించేవారి పట్ల ఖతార్ కఠినంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు డాక్టర్ అన్వర్. దోహా అలాగే జిసిసి దేశాల మధ్య విభేదాలకు ఖతార్ బాధ్యత వహించాలని బహ్రెయిన్ ఫారిన్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. జిసిసి, అలాగే కొన్ని అరబ్ దేశాలు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్న సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..









