తల్లిని వదలక మృతదేహంపైనే కూర్చున్న పసివాడు..!!!
- June 10, 2017
ఆకలిని తట్టుకోలేని పసి వయసు.. తల్లి చనిపోయిందని తెలీని మనసు.. ఉలుకూ పలుకూ లేని అమ్మ కోసం ఓ పసివాడు అల్లాడిపోయాడు.. లేచి పాలిస్తుందని ఎదురుచూసాడు. ఎంతకూ లేవని తల్లి మృతదేహంపైనే కూర్చుని దీనంగా చూసాడు. ఘట్ కేసర్ రైల్వే స్టేషన్లో చనిపోయిన తల్లి పక్కనే ఓ పసివాడి రోదన అందరినీ కన్నీరు పెట్టించింది..
గురువారం రాత్రి 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ రెండేళ్ల కొడుకుతో ఘట్ కేసర్ రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టింది. ఫ్లాట్‌ఫాంపైకి చేరుకోగానే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. కానీ చిన్నారికి తల్లి చనిపోయిందనే విషయం తెలీదు. మృతదేహం పక్కనే కూర్చుని ఏడ్చాడు. అమ్మ లేస్తుంది.. ఎప్పటికైనా తనను ఎత్తుకుంటుందని మృతదేహంపైనే కూర్చున్నాడు.
చాలాసేపటి తర్వాత చిన్నారి ఏడుపులు గమనించి మిగతా ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. మహిళ మృతి చెందిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. పాలు, బిస్కట్లు ఇచ్చి బిడ్డను సముదాయించేందుకు ప్రయత్నించారు. కానీ వాటిని తీసుకుని బిడ్డ ఏడుస్తూనే ఉన్న బాలుడు చివరికి తల్లి పక్కనే తెల్లవారే వరకూ నిద్రపోయాడు. మహిళ మూర్చతో చనిపోయిందని గుర్తించిన రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలుడిని తమ సంరక్షణలో ఉంచుకున్నారు.
రెండు వారాల క్రితం మధ్య ప్రదేశ్‌లో సరిగ్గా ఇలాంటి దృశ్యాలే దేశవ్యాప్తంగా అందరినీ కదిలించాయి. రైలు పట్టాల పక్కన మృతి చెందిన ఓ తల్లి దగ్గర బిడ్డ పాలు తాగేందుకు ప్రయత్నించడం కన్నీరు పెట్టించాయి. దామోహ్‌లో జరిగిన ఈ ఘటనలో తల్లి రైలు ఢీకొని చనిపోయిదని గుర్తించిన పోలీసులు బిడ్డను సంక్షేమ గృహానికి తరలించారు. ఇప్పుడు అలాంటి ఘటనే హైదరాబాద్‌లో అందరినీ కలచివేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







