మేము ఖతార్ కి సపోర్ట్ చేస్తాం: టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్

- June 10, 2017 , by Maagulf
మేము ఖతార్ కి సపోర్ట్ చేస్తాం: టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్

ఉగ్రవాదానికి ఆర్థికంగా అండదండలు అందిస్తున్న ఆరోపణలతో ఖతార్‌పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఖతార్‌పై ఆంక్షల విషయంలో స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ .. చాలా సంవత్సరాలుగా ఖతార్‌ ఉగ్రవాదాన్ని ప్రపంచంపైకి ఎగదోస్తుందని.. అరబ్‌ దేశాలు ఖతార్‌పై ఎప్పుడో నిషేధం విధించాల్సిందని అభిప్రాయపడ్డారు. తన పర్యటనలో సౌదీ ప్రభుత్వంతో ఈ విషయాన్ని చర్చించానని, ఇప్పటికైనా ఖతార్‌పై నిషేధం విధించడం ఆనందకరమైన విషయమన్నారు. 
 
ఇదిలా ఉంటే .. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాత్రం ఖతార్‌కు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. అక్కడి ప్రజలకు అవసరమైన నిత్యావరసర సరుకులను ఎగుమతి చేస్తామని తెలిపారు. ఖతార్‌పై విధించిన ఆంక్షలపై సౌదీ అరేబియా పునరాలోచించాలని ఆయన కోరారు. ఇస్తాంబుల్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రేయిన్‌, ఈజిప్టు తదితర అరబ్‌ దేశాలు ఖతార్‌పై ఆంక్షలు విధించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com