బ్రిటన్ ఎంపీల్లో 650 స్థానాలుకు 208 మంది మహిళలే
- June 10, 2017
బ్రిటన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మొత్తం 650 స్థానాలున్న బ్రిటన్ దిగువసభలో 208 స్థానాల్లో మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2015లో జరిగిన ఎన్నికల్లోనూ 191 మంది మహిళలే గెలుపొందడం గమనార్హం. ఈ ఎన్నికల్లో 208 స్థానాల్లో మహిళలు గెలుపొందడం ద్వారా ఆ రికార్డును అధిగమించినట్లయింది. ఈ 208 మందిలో ఎక్కువగా కన్సర్వేటివ్, లేబర్ పార్టీల నుంచి మహిళలు ఉన్నారు. ప్రధాని థెరెసా మే నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 318 స్థానాలను కైవసం చేసుకుంది. జెరెమీ కోర్బిన్ నేతృత్వంలోని విపక్ష లేబర్ పార్టీకి 261 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి 29 స్థానాలు పెరగ్గా.. కన్సర్వేటివ్ పార్టీకి 13 సీట్లు తగ్గాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించకపోవడంతో థెరెసా.. ఉత్తర ఐర్లాండ్‌లోని డెమోక్రటిక్ యూనియనిస్టు పార్టీకి చెందిన 10మంది ఎంపీల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







