పారామెడిక్స్ టీమ్‌ని సత్కరించిన సివిల్ డిఫెన్స్
- June 11, 2017
దుబాయ్ సివిల్ డిఫెన్స్, పారామెడిక్ టీమ్‌ని సత్కరించింది. అగ్ని ప్రమాదం కారణంగా కాలిపోతున్న ఓ భవనం నుంచి ముగ్గురు వ్యక్తుల్ని రక్షించే క్రమంలో వీరు ప్రదర్శించిన సాహసానికి గుర్తింపుగా ఈ సత్కారం జరిగింది. అల్ మనార్ ప్రాంతంలో గత నెలలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటలో దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్ (డిఎసిఎస్)కి చెందిన పారామెడిక్స్ టీమ్, ఓ చిన్నారి, ఓ మహిళ సహా ముగ్గుర్ని ప్రాణాపాయం నుంచి రక్షించింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రషీద్ థని అల్ మత్రోషి ఈ సందర్భంగా పారామెడిక్స్ టీమ్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. డ్రైవర్ జలాల్ అబాదీ, అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోకి దూసుకెళ్ళి చిన్నారని తీసుకొచ్చారు. పారామెడిక్ నాజర్ అల్ మజ్రోకి, ఓ వృద్ధురాల్ని బయటకు తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







