ఖతార్ సమస్యపై భారత్‌కు గల్ఫ్ దేశాల హామీ
- June 11, 2017
గల్ఫ్ దేశాల్లో తలెత్తిన ఖతార్ సమస్యకు సంబంధించి ఆయా దేశాలు చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని భారతదేశం చేసిన సూచన పట్ల ఆయా దేశాలు సానుకూలంగా స్పందించాయి. తమ దేశాల్లో ఉంటోన్న భారతీయులకు ఈ సమస్య కారణంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయా దేశాలు పేర్కొన్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని గల్ఫ్ దేశాలకు చెందిన ప్రతినిథులు పేర్కొన్నాయి. ఖతార్‌లో 6,30,000 మందికి పైగా భారతీయ కార్మికులున్నారు. ఖతార్ చిన్న దేశమైనా, అక్కడ భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఆయా దేశాల్లోని ఎంబసీని సంప్రదించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇంకో వైపున ఖతార్‌లోని దోహా నుంచి భారతీయ వలసదారులకు ఓ సూచన వచ్చింది. రూమర్స్‌ని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించరాదనీ, పరిస్థితులు ఖతార్‌లో ఏమంత ఆందోళనకరంగా లేవని ఖతార్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







