ఇదేమి గాసిప్ బాబు !!

- June 11, 2017 , by Maagulf
ఇదేమి గాసిప్ బాబు !!

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి- హీరోయిన్ ఇంద్రజ ల పై ఓ వార్త వినిపించింది. మమ్ముట్టి నిజ జీవితంలో, ఇంద్రజ కేసు వాదించారని కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే వీటిలో వాస్తవం లేదని ఇంద్రజ కొట్టిపారేసింది. ఇంద్రజకు, ఆమె మేనేజర్‌కు మధ్య నగదు లావాదేవీల విషయంలో ఏవో వివాదాలు ఏర్పడ్డాయి.. దీంతో ఇద్దరు కోర్టును ఆశ్రయించారని.. ఈ రెండేళ్లుగా కేసు నడుస్తోందని కొన్ని కధనాలు వినిపించాయి.
అయితే ఈ విషయాన్ని ఇంద్రజ దృష్టికి తీసుకెళ్లగా.. అసలు కేసు ఏంటని, తను ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదని, తన తరఫున మమ్ముట్టి వాదించలేదని వివరించింది. మమ్ముట్టి బేసిగ్గా లాయర్ అన్న సంగతి తెలిసిందే. దింతో ఈ వార్తకు కొంచెం బలం చేకూరింది. ఐతే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఇంద్రజ చెప్పడంతో ఇదంతా గాలి వార్త అని తేలిపోయింది. అయినా ఈ గాసిప్ ఎలా పుట్టిందో అర్ధం కావడం లేదు జనాలకు. ఎందుకంటే నిప్పు లేనిదే పొగ రాదుకదా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com