ఖతార్‌ కు ఆహారం పంపిణీ చేస్తున్న ఇరాన్

- June 11, 2017 , by Maagulf
ఖతార్‌ కు ఆహారం పంపిణీ చేస్తున్న ఇరాన్

టెహ్రాన్‌: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఖతార్‌తో గల్ఫ్‌దేశాలు సంబంధాలు తెంచుకోవడం వల్ల అక్కడ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. గల్ఫ్‌దేశాల నుంచి ఖతార్‌ ఎక్కువగా ఆహారపదార్థాలను దిగుమతి చేసుకునేది. కానీ ఆయా దేశాలు ఖతార్‌తో రవాణా సంబంధాలు తెంచుకోవడం వల్ల ఆహారం కొరత ఏర్పడింది. దీనిపై ఇరాన్‌ స్పందించి ఆహారాన్ని సరఫరా చేసింది. ఐదు విమానాల్లో ఖతార్‌కు ఆహార పదార్థాలు పంపించినట్లు ఇరాన్‌ అధికారులు తెలిపారు. ‘పండ్లు, కూరగాయలతో పాటు తినే ఆహారపదార్థాలను ఐదు విమానాల్లో పంపించాం. ఒక్కో విమానంలో దాదాపు 90టన్నుల ఆహారపదార్థాలను పంపించినట్లు’ ఇరాన్‌ వైమానిక దళ ప్రతినిధి షహ్రోక్‌ నౌషాబది తెలిపారు.
ఖతార్‌కు ఇంకా అవసరమైతే పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. విమానాలతో పాటు మూడు పెద్ద ఓడల్లో 350 టన్నుల ఆహారాన్ని ఇరానియన్‌ పోర్టు ఉంచి ఖతార్‌కు పంపించారు. ఉగ్రవాదానికి నిధులు ఇస్తూ ప్రోత్సహిస్తుందని ఖతార్‌తో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఈజిప్టు, యెమెన్‌ దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com