షార్జాలో 7 వ అంతస్తు నుంచి కింద పడి మహిళ మృతి
- June 11, 2017
షార్జా : స్థానిక అల్ మరీజా ప్రాంతంలోని ఒక భవనం ఏడవ అంతస్తు పై నుంచి 41 ఏళ్ల ఇండోనేషియా మహిళ పడిపోయి మరణించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ మరణం గూర్చి సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు తెలియచేస్తూ, శనివారం రాత్రి తమ కార్య నిర్వహణ గదికి ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. వెంటనే తాము, అంబులెన్స్ సిబ్బంది నేర ప్రదేశానికి తరలివెళ్లినట్లు తెలిపారు. అక్కడ వారు రక్తం మడుగులో దారుణంగా చనిపోయిన స్త్రీని కనుగొన్నారు. ఈ మరణం యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు మహిళ యొక్క శరీరం శవపరీక్ష కోసం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించబడింది. ఆ మహిళ చనిపోయే ముందు చివరిసారిగా కల్సిన వ్యక్తులు ..ఆమెకు పరిచయం సంబంధాలు ఉన్నట్లు విశ్వసించిన వారిని పోలీసులు అదుపులోనికి తీసుకొన్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అల్ ఘర్బ్ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు., దర్యాప్తు పూర్తి కాక ముందే ఈ కేసు ఆత్మహత్య అని పరిగణించలేమని ఆ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!







