ఇంట్లో స్మోక్‌ డిటెక్టర్‌: డెడ్‌లైన్‌ అక్బోర్‌ 1

- June 11, 2017 , by Maagulf
ఇంట్లో స్మోక్‌ డిటెక్టర్‌: డెడ్‌లైన్‌ అక్బోర్‌ 1

షార్జాలో ప్రతి ఇంట్లోనూ స్మోక్‌ డిటెక్టర్‌ ఇకపై తప్పనిసరి కానుంది. అక్టోబర్‌ 1వ తేదీలోగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో స్మోక్‌ డిటెక్టర్‌ని ఏర్టాపు చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్‌ డిఫెన్స్‌ ఈ మేరకు సర్క్యులర్‌ని జారీ చేసింది. షార్జా మునిసిపాలిటీ డైరెక్టర్‌ జనరల్‌ కల్నల్‌ సమి అల్‌ నక్బి మాట్లాడుతూ, తమ శాఖ ఈ మధ్యనే మూడు సంస్థలకు ఫైర్‌ డెటెక్టివ్‌ డివైజెస్‌ అమ్మకాలపై అనుమతులు జారీ చేసినట్లు చెప్పారు. మరికొన్ని కంపెనీలు కూడా తమ డివైజెన్‌ని విక్రయించేందుకు అనుమతులు పొందే అవకాశముందని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఏ భవనానికి అనుమతి లభించాలన్నా ముందుగా, సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌పై నిర్మాణదారు. యజమాని స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాలపై అవగాహనా కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com