మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతన చెల్లింపులు

- June 11, 2017 , by Maagulf
మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతన చెల్లింపులు

మొహ్మద్‌ బిన్‌ రషీద్‌ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు జూన్‌ నెల వేతనాల్ని ఈ నెలలో ముందుగానే అందుకోనున్నారు. దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఆదేశాల మేరకు వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు ప్రైమ్‌ మినిస్టర్‌ - యూఏఈ, ముందస్తు జీతాల డిపాజిట్‌పై చర్యలు వేగవంతమయ్యాయి. జూన్‌ 15న ఉద్యోగులకు జీతాలు అందనున్నాయి. ఈద్‌కి సరిగ్గా పది రోజుల ముందు జీతాలు అందుకోనుండడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్‌ - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ రహామాన్‌ సలే అల్‌ సలె, షేక్‌ మొహ్మద్‌ బిన్‌ రషీద్‌ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రమదాన్‌ మాసాన్ని ఉద్యోగులు ఇంకా ఆనందంగా జరుపుకునేందుకు షేక్‌ మొహమ్మద్‌ చూపిన పెద్ద మనసు చాలా గొప్పదని అన్నారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com