సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరపడ్డ గుర్తుతెలియని వ్యక్తి
- June 12, 2017
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కలకలం చోటుచేసుకుంది. సల్మాన్ ఇంట్లోకి చొరబడేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించడం కలకలం రేపింది. బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ బిల్డింగ్‌లోకి ఒక యువకుడు చొరబడ్డాడు. సెక్యురిటీ గార్డు లేకపోవడంతో అతడు లోపలికి వెళ్లిపోయాడు. స్థానికులు అప్రమత్తం చేయడంతో సెక్యురిటీగార్డు.. పోలీసులకు సమాచారం అందించాడు. బాంద్రా పోలీసులు వచ్చి అపార్ట్మెంట్లోకి చొరబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని మహ్మద్ షిరౌద్దీన్(25)గా గుర్తించారు. అతడిని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసుల విచారణలో తేలింది. తర్వాత అతడిని విడిచిపెట్టారు. నిందితుడిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం ‘ట్యూబ్‌లైట్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కబీర్ ఖాన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 25న విడుదల కానుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







