పారిశుధ్య కార్మికులకు ఎండ నుంచి రక్షణ కప్పులు పురపాలకశాఖ అందచేత
- June 12, 2017
జెడ్డా : పురపాలక సంఘాల పరిధిలో వివిధ ప్రదేశాలలో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు కింద పనిచేసే కార్మికులకు మూడు నెలల నిషేధం గురువారం (15 వ తేదీ) మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల వరకు పని నిషేధం అమలులో రానున్న విషయం పాఠకులకు విదితమే లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ పారిశుధ్య కార్మికులు రోజుల వరకు ఎండ బారిన పడకుండా నీడ పట్టున పనిచేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లకు ఆదేశించింది. రియాద్ పురపాలక సంఘం పరిధిలో శుభ్రపరిచే కార్మికులకు 6,000 ఎండ తగలని రక్షణ కప్పులను అందజేయాలని కోరింది. తబూక్ మునిసిపాలిటీ ప్రధాన వీధులకు కేటాయించిన కార్మికులకు సన్ షేడ్స్ తో ఉన్న 400 బండ్లను అందించింది మరియు నగరవ్యాప్తంగా ఉన్న కార్మికులకు 1,000 తలకు నీడను ఇచ్చే షేడ్స్ అందించబడ్డాయి. కస్సిమ్లోని మునిసిపాలిటీలు కార్మికులను సన్ షేడ్స్ ను జూన్ 15 వ తేదీ నుంచి సెప్టెంబరు 15 వ తేదీ వరకు అమలులో నిషేధం అమలవుతుందని తెలిపారు. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల భద్రతకు హామీ ఇవ్వాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పని సంబంధిత ఘటనలను తగ్గించేందుకు కార్మికులకు రక్షణను మెరుగుపరిచేందుకు తాము శ్రద్ధగా పని చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖాలిద్ అబాఅల్ అన్నారు నిషేధిత సమయంలో వాతావరణ పరిస్థితులను పరిశీలించేందుకు గవర్నర్లతో సమన్వయంతో మంత్రిత్వశాఖ పని చేస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







