ఖతిఫ్ లో అత్యవసర దళ అధికారిని బలిగొన్న పేలుడు పరికరం
- June 12, 2017
ప్రజల రక్షణార్ధమై రేయంబగళ్లు కాపలా కాచే పోలీస్ అధికారులు తీవ్రవాదుల రక్త దాహానికి బలి కాబడుతున్నారు. ఈ సంఘటన అదే కోవలోనికి చెందుతుంది. స్థానిక అల్-మాసౌరా జిల్లాలోని ఖతిఫ్ ప్రాంతంలో ఆదివారం బాగా పొద్దుపోయాక గుర్తించబడని అనుమానితులు పేల్చిన ఒక పేలుడు పరికరం ఒక అత్యవసర దళాల అధికారిని దారుణంగా హతమార్చి మరో ఇద్దరు అధికారులను తీవ్రంగా గాయపరిచింది. మరణించిన ఆ అధికారి పేరు మేజర్ తారిక్ బిన్ అబ్దుల్లాతఫ్ అల్-అల్లాఖీగా పేర్కొంటున్నారు. ఖతిఫ్ సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న ఈ ముగ్గురు అధికారులు ప్రయాణిస్తున్న వాహనంను ఒక పేలుడు పదార్ధాలతో కూడిన పరికరం ఏదో బలంగా ' ఢీ ' కొట్టింది. దీనితో అక్కడ ఒక భారీ విస్ఫోటనం జరిగినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి తెలిపారు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అధికారులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







