డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ కారుకు యాక్సిడెంట్

- June 13, 2017 , by Maagulf
డైరెక్టర్  ఇంద్రగంటి మోహన్ కృష్ణ కారుకు యాక్సిడెంట్

ఇప్పటికే సినీ పరిశ్రమలో అనేక విషాద సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి.. తాజాగా ప్రముఖ ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ  కారు కూడా యాక్సిడెంట్ కు గురైంది.. కాగా ఈ ప్రమాదం లో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.. ఈ ప్రమాదం నుంచి ఇంద్రగంటి మోహన్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...
ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కారు హైదరాబాద్ బేగమ్ పేట్ లో మెట్రో పిల్లర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా.. మోహన్ కృష్ణ కు స్వల్ప గాయాలతో బయట పడినట్లు సమాచారం.. అయితే యాక్సిడెంట్ కు కారణం రాత్రంతా నిద్రలేకుండా.. డ్రైవ్ చెయ్యడం వల్లే జరిగింది అని పోలీసులకు చెప్పారట.. కాగా అష్టా చెమ్మా సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా అడుగు పెట్టిన ఇంద్రగంటి మోహన్.. గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు ఆ తర్వాత, జెంటిల్ మెన్ వంటి సినిమాలను తెరకెక్కించాడు.. తాజాగా అమీ తుమీ సినిమా రిలీజ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకొని పోతున్నది.. గత కొని రోజులుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మరణాలు చోటు చేసుకొంటున్న నేపద్యంలో ఇంద్రగంటి కారు యాక్సిడెంట్ వార్త తో ఫిల్మ్ నగర్ ఒక్కసారిగా ఉల్కిపడింది.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సేఫ్ అనే వార్తతో ఊపిరి పీల్చుకొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com