రంజాన్ షాపింగ్‌తో హైదరాబాద్ లో పాతబస్తీ కిటకిట
- June 13, 2017
రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్‌తో భాగ్యనగరం కళకళలాడుతోంది. చార్మినార్, మక్కా మసీద్, లాడ్ బజార్, మదీనా, బేగంబజార్ ప్రాంతాల్లో నైట్ షాపింగ్ ఊపందుకుంది. తక్కువ ధరలకు లభించే డిజైనరీ వేర్స్, డ్రైఫ్రూట్ షాపులు కిటకిటలాడుతున్నాయి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పాతబస్తీ విద్యుత్ వెలుగులతో కళకళలాడుతోంది. చార్మినార్, పత్తర్‌గట్టి, మదీనా తదితర ప్రాంతాలు ప్రత్యేక శోభతో వెలిగిపోతున్నాయి. భారీగా వస్తున్న సందర్శకులతో చార్మినార్, మక్కా మసీదు, పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఉపవాస దీక్షలు విడిచిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేయడానికి వస్తుండటంతో పాతబస్తీలోని పలు ప్రాంతాలు రద్దీగా మారాయి. వస్త్రాలు, అలంకరణ వస్తువులు , గృహోపకరణాలు, లాడ్ బజార్లో గాజులు మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత పండ్లు, ఫలహారాలకు తీసుకోవడంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. ఖర్భూజ, మామిడి, ఆపిల్, ద్రాక్ష, పైనాపిల్ సహా డ్రై ఫ్రూట్స్ విక్రయాలతో పాతబస్తీ కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో రాత్రి సమయంలో నెలకొంటున్న సందడి అంతా ఇంతా కాదు. మార్కెట్ లో ఏ కొత్త డిజైనరీ పాదరక్షలు విడుదలైనా అవి పాతబస్తీలో లభిస్తాయి. అతి తక్కువ ధరలకు డిజైనరీ పాదరక్షలు లభిస్తుండటంతో చెప్పుల షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఏ కలర్ మ్యాచింగ్ డ్రెస్ కు ఆ కలర్ చెప్పులు వేసుకోనుండటం ఫ్యాషన్ మారింది. పాతబస్తీలో తెల్లవారుజాము వరకు రంజాన్ నైట్ బజార్ కొనసాగుతుంటంతో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. మక్కామసీదు నుంచి మదీనా వరకు ఏర్పాటు చేసిన షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









