కొత్త 'రవీంద్ర భారతి'కి సి. నారాయణరెడ్డి పేరు

- June 13, 2017 , by Maagulf
కొత్త 'రవీంద్ర భారతి'కి  సి. నారాయణరెడ్డి పేరు

మహాకవి, సాహితీవేత్త డాక్టర్ సి. నారాయణరెడ్డి విగ్రహన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో సినారె స్మారక మ్యూజియం, రవీంద్రభారతి తరహాలో సాహితీ సమావేశమందిరం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ లోని ఒక ప్రముఖ సంస్థకు లేదా యూనివర్శిటీకి సినారె పేడతామని కేసీఆర్ చెప్పారు.
సాహితీ మకుటంలో సినారె కలికితురాయన్న ముఖ్యమంత్రి, సినారె మాట, సభ అంటే ఒక గ్లామర్ అని చెప్పారు. సినారె అంత్యక్రియల్లో పాల్గొనే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. సినారె పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సినారె సభలకు వందలాది మంది వచ్చేవారని గుర్తు చేశారు. ఆది ప్రాసలకు అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పడంలో వారికి వారే సాటి. సినారెకు ఎవరూ పోటీలేరని కేసీఆర్ అన్నారు.
బుధవారం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు అన్ని జిల్లాల నుంచి సినారె అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరుఫున వారికి ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com