విశ్రాoతి గదిలో చనిపోయిన ప్రవాస భారతీయుడు
- June 13, 2017
బహ్రెయిన్:బతుకు తెరువు కోసం కుటుంబ సభ్యులను వదిలి ఎడారి దేశాలలో రేయంబగళ్లు పనిచేసే పలువురు కార్మికుల జీవితాలు అర్దాయుస్సుతో విషాదంగా ముగిసిపోతున్నాయి. ఆ జాబితాలో మంగళవారం మరో ప్రవాస భారతీయుడు చేరాడు. ఎవరికీ తెలియకుండా ఒక విశ్రాoతి గదిలో ఆయన చనిపోయినట్లు తోటి కార్మికులు కనుగొన్నారు.ఒక కాంట్రాక్టు సంస్థలో పనిచేసి సేవ్య రాథవన్ మృతి చెందినట్లుగా ఉదయం 10.45 గంటలకు వైద్యులు ప్రకటించారు "తనకు ఆరోగ్యం బాగోలేదని తనపై అధికారి సూపర్వైజర్ కు ఫిర్యాదు చేశాడు ఒకపూట శెలవు తీసుకోమని ఆ పర్యవేక్షకుడు ఆయనకు అనుమతి ఇచ్చారు. దీంతో నేరుగా విశ్రాoతి గదికి వెళ్ళి సేవ్య రాథవన్ పడుకొన్నారు. అయితే ఎంతసేపటికి ఆయన నిద్ర లేకపోవడంతో సహోద్యోగులు విశ్రాoతి గది తలుపులు పగలకొట్టి లోనికి ప్రవేశించారు, సేవ్య రాథవన్ నేల మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గమనించి ఆయనను కార్మిక శిభిరంలోని ఆసుపత్రికి తక్షణమే తరలించారు. కానీ, అక్కడ వైద్యులు సేవ్య రాథవన్ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రవాస భారతీయుడు మరణించినట్లు వైద్యులు తర్వాత నిర్ధారించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







