శంషాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
- June 13, 2017
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఎనిమిది అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం దాదాపు ఆరు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు.. ఎనిమిది అంతస్తుల భవనంలో అనుపమ రెసిడెన్సీ లాడ్జీని నిర్వహిస్తున్నారు. కొన్ని ఫ్లోర్లను ఇతర పనులకు అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో నేటి ఉదయం భవనంలోని రెండో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు ప్రారంభమయ్యాయి. అంతలోనే మరో మూడు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. లాడ్జీలో 50 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం.
తొలుత స్థానికుల సాయంతో కేవలం హోటల్ సిబ్బంది స్వయంగా మంటలు ఆర్పేందుకు తీవ్ర యత్నాలు చేసింది. అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోగానే భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మూడో అంతస్తులో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి మంటల్లో కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది ఆ హోటల్లో ఉన్న వారిని సురక్షితంగా భయటకు చేర్చింది. కొంత సమయం శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే ఈ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయటకు వెళ్లేందుకు ఉండే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదని స్థానికులు చెబుతున్నారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









