సైనా నెహ్వాల్, పి.వి సింధులు శుభారంభం
- June 13, 2017
- క్వార్టర్స్‌లో హైదరాబాదీ అమ్మాయిలు
- ఇండోనేషియా ఓపెన్ ప్రీమియర్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిలు సైనా నెహ్వాల్, పి.వి సింధులు ఇండోనేషియా ఓపెన్‌లో శుభారంభం చేశారు. థారులాండ్ ఓపెన్ నుంచి విశ్రాంతి తీసుకున్న సింధు.. జకర్తాలో కొత్త ఉత్సాహంతో కనిపించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన హైదరాబాదీ షట్లర్లు టైటిల్ వేటలో ఓ అడుగు ముందుకేశారు. మాజీ వరల్డ్ చాంపియన్, ఎనిమిదో సీడ్ రచనాక్ ఇంటనాన్ (థారులాండ్)పై 17-21, 21-18, 21-12తో సైనా నెహ్వాల్ గెలుపొందింది. థారులాండ్‌కే చెందిన పొర్నపవీ చొచువొంగ్‌పై 21-12, 21-19తో పి.వి సింధు విజయం సాధించింది. ఇంటనాన్‌తో మ్యాచ్‌లో తొలి గేమ్‌లో 10-4తో ముందుంజలో ఉన్న సైనా.. ద్వితియార్థంలో నెమ్మదించింది. 14-14తో స్కోరు సమం చేసిన రచనాక్ అదే జోరును గేమ్‌ను సొంతం చేసుకున్నది. రెండో గేమ్‌లో 12-7తో అదరగొట్టిన సైనా.. 16-16తో రచనాక్ దూసుకొచ్చినా వెనక్కి తగ్గలేదు.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 8-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా.. రచనాక్ పుంజుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-12తో ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. ఏకపక్షంగా సాగిన మరో మ్యాచ్‌లో పి.వి సింధు అలవోక విజయం అందుకున్నది. నేడు జరిగే ప్రీ క్వార్టర్స్‌లో థారులాండ్ షట్లర్ నిచనాన్ జిందపాల్‌తో సైనా నెహ్వాల్.. బివెన్ జాంగ్ (అమెరికా)తో పి.వి సింధు తలపడనున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి, అశ్విని పొన్నప్ప జోడీ 12-21, 9-21తో ఇండోనేషియా జంట చేతిలో పోరాడి ఓడారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణరు, బి. సాయి ప్రణీత్‌లు నేడు బరిలోకి దిగనున్నారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







