అల్‌ ఫరూక్‌ జంక్షన్‌ ప్రారంభం

- June 14, 2017 , by Maagulf
అల్‌ ఫరూక్‌ జంక్షన్‌ ప్రారంభం

అల్‌ ఫరూక్‌ జంక్షన్‌ ఈ రోజు ట్రాఫిక్‌ కోసం ప్రారంభించబడుతోంది. ఆరేళ్ళ మూసివేత అనంతరం ఈ జంక్షన్‌ని ప్రారంభిస్తున్నారు. వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌, కింగ్‌ ఫైసల్‌ హైవే ఇంటర్‌సెక్షన్‌పై (సెంట్రల్‌ మనామా మార్కెట్‌, అవెన్యూ 28 - దానా మాల్‌ మరియు బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వైపు) కొత్త ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నివాసితులు, పౌరులు ట్రాఫిక్‌ రూల్స్‌ని, అలాగే ట్రాఫిక్‌ సైన్స్‌ని పాటించాలనీ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. జిసిసి టు పెరల్‌ రౌండెబౌట్‌గా ప్రాచుర్యంలో ఉన్న ఈ జంక్షన్‌ 2011 మార్చి 18న కూల్చివేయబడింది. ఆ తర్వాత అల్‌ ఫరూక్‌ జంక్షన్‌గా మార్పు చేసి, ట్రాఫిక్‌ లైట్స్‌ని ఏర్పాటు చేసి ఆధునీకరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com