తయ్యిబా గ్రూప్ నుంచి ప్రతిరోజూ 300 ఇఫ్తార్ మీల్స్
- June 14, 2017
తయ్యిబా అనే స్వచ్ఛంద సంస్థ రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి 300 ఇఫ్తార్ మీల్ ప్యాకెట్స్‌ని సుర్ ప్రాంతంలో పంపిణీ చేస్తోంది. అలాగే ఈ సంస్థ సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్‌ని కూడా చేపడుతోంది. ప్రమాదాల్లేని రమదాన్ అనే నినాదంతో ఈ క్యాంపెయిన్‌ని చేపట్టారు. టీమ్ సూపర్‌వైజర్ వాలిద్ ఫాయెజ్ ముబారక్ అల్ హజ్రి మాట్లాడుతూ, 2014లో ఏర్పాటయిన తమ టీమ్‌లో 30 మంది సభ్యులున్నారని చెప్పారు. సుర్ స్పోర్ట్స్ క్లబ్‌కి పనిచేస్తున్న తమ మెంబర్స్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మీల్స్ ప్రిపేర్ చేసి, మఘ్రిబ్ ప్రేయర్ అనంతరం వాటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సకి అల్ సాయిమ్ పేరుతో తమ సభ్యులు మాస్క్‌ల వద్ద వాటర్ బాటిల్స్‌ని కూడా సరఫరా చేస్తున్నట్లు మరో మెంబర్ చెప్పారు. రమదాన్ తర్వాత, మాస్ వెడ్డింగ్స్‌ని నిర్వహించనున్నట్లు మజ్రి పేర్కొన్నారు. తమకు మొదట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయనీ, ఇప్పుడు ఒమన్ ఎల్‌ఎన్‌జి, ఒమన్ ఇండియన్ ఫెర్టిలైజర్ కంపెనీ వంటి సంస్థలు తమకు మద్దఉతగా నిలవడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగి, సేవా కార్యక్రమాల్ని ముమ్మరంగా చేయగలుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







