ఫాస్టింగ్‌తో క్యాబ్‌ డ్రైవర్లలో పెరిగిన ఏకాగ్రత

- June 14, 2017 , by Maagulf
ఫాస్టింగ్‌తో క్యాబ్‌ డ్రైవర్లలో పెరిగిన ఏకాగ్రత

పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉండటం ముస్లిం సమాజంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉపవాసాలు క్యాబ్‌ డ్రైవర్లలో అనూహ్య మార్పుల్ని తీసుకొస్తున్నాయి. ఏకాగ్రత, చిత్తశుద్ధి పెరిగి, బాధ్యతాయుతంగా తాము వ్యవహరిస్తున్నట్లు క్యాబ్‌ డ్రైవర్లు పేర్కొన్నారు. ఉపవాసం మొదట్లో కొంచెం నీరసంగా అన్పించినా, ఆ తర్వాత ఆ నీరసం తమ దరిచేరదని ఇండియా నుంచి వచ్చిన ఓ క్యాబ్‌ డ్రైవర్‌ చెప్పారు. ఉపసవాస దీక్ష ముగిసిన అనంతరం ఇఫ్తార్‌ మీల్స్‌ అందకపోయినప్పటికీ తమలో ఉపవాసం తాలూకు నిరసం కనిపించడంలేదని ఇంకొందరు అంటున్నారు. ఇఫ్తార్‌ సమయానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఇఫ్తార్‌ మీల్స్‌ ఎంతో ఉపయోగరంగా ఉంటున్నాయని మరికొందరు క్యాబ్‌ డ్రైవర్లు చెప్పారు. పవిత్ర రమదాన్‌ మాసంలో ఉపవాసంతో క్రమబద్ధమైన మంచి జీవన క్రమం అలవాటవుతుందని ఎక్కువమంది క్యాబ్‌ డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు. దోహా సహా పలు నగరాల్లోని పలు హోటళ్ళు రమదాన్‌ ఇఫ్తార్‌ పార్సిల్స్‌ని ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఉచితంగా అందిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com