యూఎస్‌లో మరో భారతీయుడి కాల్చివేత
- June 14, 2017
అమెరికాలోవున్న భారతీయులకు రక్షణ లేకుండా పోతోంది. గడచిన 5 నెలల్లో ముగ్గురు భారతీయులపై దాడులు జరగ్గా, తాజాగా మరో భారతీయుడిని పొట్టన పొట్టుకున్నారు దుండగులు. అట్లాంటాలోని డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో పనిచేస్తున్న 24 ఏళ్ల యువకుడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
గుజరాత్‌లోని పటాన్ జిల్లా సుంథేర్ ప్రాంతానికి చెందిన సమీర్ పటేల్, ఉద్యోగం కోసం అమెరికాకి వెళ్లాడు. ఆ తర్వాత ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో వర్క్ చేస్తున్నాడు. సోమవారం రాత్రి స్టోర్స్ మూసివేస్తున్న సమయంలో అందులోకి చొరబడ్డారు దుండగులు. అతడి నుంచి క్యాష్ రిజిస్ట్రర్ లాక్కునేందుకు ప్రయత్నించగా, వాళ్లని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే దుండగులు సమీర్‌పై కాల్పులకు దిగడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. సమీర్ విషయం తెలియగానే అతడి కుటుంబసభ్యులు అట్లాంటా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







