హాట్ టాపిక్ గా మారిన నటుడు బ్రహ్మానందం ఆస్థుల వ్యవహారం
- June 14, 2017
కమెడియన్ గా మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమారంగాన్ని ఏలిన బ్రహ్మానందం పాపులారిటీ గురించి ఎరగని తెలుగ వాడు ఉండడు. కొంతకాలం క్రితం టాప్ హీరోలు అంతా బ్రహ్మానందం లేకుండా తాము సినిమాలు చేయమని స్టార్ హీరోలు తమ దర్శకులకు చెప్పడమే కాకుండా బ్రహ్మానందం డేట్స్ బట్టి టాప్ హీరోలు తమ డేట్స్ సర్దుబాటు చేసిన పరిస్థితులు కూడ ఉన్నాయి.
చిన్నచిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్రహ్మానందం తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్ రికార్డు క్రియేట్ చేసాడు. బ్రహ్మీ డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో అతడి సంపాదన కూడ అదే స్థాయిలో పెరుగుతూపోయి ఆయన ఆస్థుల వివలు భారీగా పెరిగి పోయాయని ఒక ఆంగ్ల దినపత్రిక ఒక ఆసక్తికర కధనాన్ని ప్రచురించింది టాలీవుడ్లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే కమెడియన్ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం. ఆయన ఆస్తుల విలువ 320 కోట్లవరకు ఉంటుందని ఆ పత్రిక కధనం.
అంతేకాదు బ్రహ్మానందం వద్ద ఖరీదైన ఆడి ఆర్ 8, ఆడి క్యూ 7, మెర్సిడెజ్ బెంజ్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయని జూబ్లీహిల్స్‌లోని పోష్ ఏరియాలో బ్రహ్మానందానికి కోట్ల విలువైన ఇల్లు ఉందని దాంతో పాటు కోట్ల రూపాయల విలువ చేసే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నట్లు ఆపత్రిక కధనం అత్తిలిలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం నిజ జీవితంలోని వ్యక్తులను మిమిక్రి కళాకారుడుగా అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలు పొంది దర్శకుడు జంధ్యాల ఇచ్చిన లిఫ్ట్ తో టాప్ కమెడియన్ గా మారిపోయాడు.
1000కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పటికే చరిత్ర సృష్టించాడు. 'ఎర్ర బస్సు' చిత్రంతో 1000 సినిమాల మార్కును అందుకున్నాడు. నటించిన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ హాస్యానికి కొత్త ఒరవడిని తనకు తాను ఏర్పరుచుకున్న బ్రహ్మానందం హవా ఇప్పుడు పూర్తి గా తగ్గిపోయినా తన సినిమా సంపాదనకు సంబంధించి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా చాల తెలివిగా వ్యవహరిస్తూ ఇప్పటికీ తన రేంజ్ ని కొనసాగిస్తున్న బ్రహ్మి తెలివి తేటలు నేటి తరం కమెడియన్స్ కు ఒక పాఠ్యపుస్తకం అనుకోవాలి.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









