అమ్నెస్టీ: 400,000 ఉల్లంఘనుల ఎగ్జిట్‌

- June 14, 2017 , by Maagulf
అమ్నెస్టీ: 400,000 ఉల్లంఘనుల ఎగ్జిట్‌

రియాద్‌: డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ (జవాజత్‌) మేజర్‌ జనరల్‌ సులైమాన్‌ అల్‌ యాహ్యా మాట్లాడుతూ, మూడు నెలల అమ్నెస్టీని వినియోగించుకుని 400,000 మంది ఉల్లంఘనులు దేశం విడిచి వెళ్ళారని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 404,253 మంది లేబర్‌ మరియు రెసిడెన్సీ లా ఉల్లంఘనులు అమ్నెస్టీ పీరియడ్‌ ద్వారా లబ్ది పొందారు. మక్కా సమీపంలోని షమైసిలోగల జవజత్‌ డిటెన్షన్‌ సెంటర్‌ - జనరల్‌ సర్వీస్‌ సెంటర్‌ని పర్యటించిన సందర్భంగా అల్‌ యహ్యా ఈ వివరాలు వెల్లడించారు. అమ్నెస్టీలో మిగిలిన 13 రోజుల్ని వినియోగించుకుని, ఈలోగా ఉల్లంఘనులు లబ్ది పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో అమ్నెస్టీ తర్వాత చట్ట పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com