ముగ్గురు వలసదారుల మృతి

- June 14, 2017 , by Maagulf
ముగ్గురు వలసదారుల మృతి

గడచిన ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు వలసదారులు తమ లేబర్‌ క్యాంప్‌ వద్ద మృతి చెందిన దశలో కనుగొనబడ్డారు. చిత్రవేలు షన్ముగం అనే భారతీయ వలసదారుడు, అల్‌ నైమ్‌ ప్రాంతంలోని లేబర్‌ క్యాంప్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ట్రేడర్‌గా చిత్రవేలు పనిచేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో చిత్రవేలు ఉరివేసుకుని కన్పించాడని అతని రూమ్‌మేట్స్‌ తెలిపారు. మరో భారతీయ వలసదారుడు రాజు, అ అలిలోని తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని కనిపించాడు. హౌస్‌ బాయ్‌గా రాజు పనిచేస్తున్నాడు. మరో భారతీయ వలసదారుడు అమన్‌దీప్‌ సింగ్‌, వెస్ట్‌ ఎకెర్‌లోని తన క్యాంప్‌లో మృతి చెందాడు. ఓ కాంట్రాక్టింగ్‌ కంపెనీలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు అమన్‌దీప్‌ సింగ్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com