నిజ జీవితంలో కోర్టు మెట్లు ఎక్కనున్నహీరో మహేష్ బాబు
- June 15, 2017
ప్రిన్స్ మహేష్ బాబు.. సూపర్ హిట్ మూవీ శ్రీమంతుడు.. సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. మహేష్ కు మంచి పేరుని కూడా తెచ్చింది.. కాగా తన నవలను కాపీ కొట్టి.. శ్రీమంతుడు సినిమా తెరకెక్కించారాని.. తనకు జరిగిన అన్యాయానికి తుది వరకూ పోరాడతానని.. నవలా రచయిత శరత్ చంద్ర కోర్టు మెట్లు ఎక్కిన సంగతి విధితమే... చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి వారు కోర్టు బయటే రాజీ యత్నాలు చేశారు.. కానే వారు ఇవ్వజూపిన మొత్తం తక్కువ కావడంతో.. రచయిత రాజీకి రెడీ లేడు.. దీంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా శ్రీమంతుడు చిత్ర హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ ను కోర్టుకు హజారు కావాల్సిందేనని.. నాంపల్లి కోర్టు ఆదేశాలను జారీ చేసింది.. కాగా ఇదే విషయంపై మహేష్ తరపు న్యాయవాది చెప్పిన.. సంగతి ఏమిటంటే.. హీరోకి కధ కాపీ విషయంలో అంతగా సంబంధం ఉండదు.. ఎందుకంటే హీరో.. తన వద్దకు వచ్చిన కధ కాపీనా.. లేక ఒరిజినల్ అనా చూసుకొనే వ్యవహారంతో హీరోకి ఎటువంటి సమంధం ఉండదు.. కాపీ కధ వివాదం.. కధా రచయిత, నిర్మాత, దర్శకులే బాధ్యత.. అని చెప్పారు.. కాగా చట్టం ప్రకారం.. హీరోని కూడా కోర్టు ప్రశ్నిస్తుందని తెలిపాడు.. కాగా మహేష్ సినిమాల్లో కోర్టు మెట్లు ఎక్కితే ఒకే.. కానీ నిజ జీవితంలో కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం అభిమానులకు నచ్చని సంగతి.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









