సోషల్ మీడియా వినియోగదారులను పర్యవేక్షించేందుకు అధికారులు
- June 15, 2017
కువైట్: సామాజిక మాధ్యమాలలో ఇక అవాకులు ..చెవాకులతో చెలరేగితే, చెరసాల ఖాయమంటున్నారు కువైట్ అధికారులు...సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేసేవారిని , ఇతర దేశాలపై వివిధ చేష్టలతో దాడి చేయటం లేదా ఫోటోలు , వ్యాఖ్యలు ప్రాంతీయతత్వం మరియు దేశద్రోహాన్ని ప్రేరేపించే విధంగా ప్రవర్తించే సామాజిక మీడియా వాడుకదారులను ఇక త్వరలోనే పర్యవేక్షించనున్నట్లు స్థానిక స్థానిక మీడియా తెలిపింది.ఆ నివేదిక ప్రకారం, సామాజిక మాధ్యమాల పర్యవేక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మరియు ఇతర మీడియా వేదికలలో ప్రచురమయ్యే వివిధ పోస్ట్ లను శ్రద్ధగా పరిశీలిస్తుంది. ఎవరైతే ఇతర దేశాల్లో దేశద్రోహ చర్యలు , ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడ్తూ పోస్టులు చేసే వ్యక్తులు మరియు వివిధ వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే విధానాలను...వివిధ వర్గాల మధ్య వివాదాలను మండించేందుకు ప్రయత్నిస్తున్నవారిని గుర్తించేందుకు ఈ కమిటీ దృస్టని నిశితంగా కేంద్రీకరించనుంది. అదేవిధంగా పాల్పడే వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను సేకరించి వారు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిరూపించబదినట్లు పలు ఆధారాలు సేకరించి న్యాయవ్యవస్థకు నేరుగా నివేదించబడతాయి.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్‌లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









